Nellore: కామాక్షీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం.. పోటెత్తిన భక్తులు!
Nellore: నెల్లూరు జిల్లా సంగంలో వెలసిన శ్రీ కామాక్షీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Nellore: కామాక్షీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం.. పోటెత్తిన భక్తులు!
నెల్లూరు: నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని శ్రీ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ కామాక్షీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించే అమ్మవారి కరుణాకటాక్షం ఎల్లవేళలా తమపై ఉండాలని మనసారా ప్రార్థించారు.




