Sangam: యూరియా అధిక సంఖ్యలో వాడరాదు.. వ్యవసాయ శాఖ అధికారి
Sangam: సంగం మండలం జండా దెబ్బ గ్రామంలో యూరియా నియంత్రణపై వ్యవసాయ శాఖ అవగాహన సదస్సు.
Sangam: యూరియా అధిక సంఖ్యలో వాడరాదు.. వ్యవసాయ శాఖ అధికారి
సంగం: మండలం జండా దెబ్బ గ్రామంలో యూరియా అధికంగా సంఖ్యలో వాడరాదని అవగాహన కార్యక్రమం. మండల వ్యవసాయ అధికారి శశిధర్ నిర్వహించారు. అధికంగా యూరియా వాడటం వలన భూమి సారాన్ని కోల్పోయి చౌడు పెరుగుతుంది, నేల మరియు నీటి కాలుష్యం పెరుగుతుందని దీనివల్ల రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉందని తెలపడం అయినది.
అదేవిధంగా జీవన ఎరువులు అజిటోబక్టర్ ,అజోస్ పరిల్లామ్ PSB,KRB వంటివి పశువుల ఎరువులో కలిపి నాటిన 15 రోజులకి చల్లుకుంటే ఒక బస్తా యూరియా తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం ఏవో రామ్మోహన్ పాల్గొని అజోలాను వేసుకుంటే గాలిలో ఉండే నత్రజని మొక్కలకు అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరత్నం VAA అనిత, APCNF సిబ్బంది మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.




