Sangam: ఓటర్ల జాబితా లోపాల సవరణ వేగవంతం సంగం తహసీల్దార్
Sangam: సంగం మండలంలో ఓటర్ల జాబితా సవరణ వేగవంతం. 2,100 అనామలీస్, 304 నో-మ్యాపింగ్ ఓట్లు గుర్తింపు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బిఎల్ఓల ద్వారా డోర్-టు-డోర్ సర్వే.
Sangam: ఓటర్ల జాబితా లోపాల సవరణ వేగవంతం సంగం తహసీల్దార్
సంగం: నెల్లూరు జిల్లా సంగం మండల పరిధిలో ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను గుర్తించి సరిదిద్దే ప్రక్రియను వేగవంతం చేసినట్లు సంగం తహసీల్దార్ సారంగపాణి తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని ఓటర్ల జాబితాపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మండలంలో మొత్తం 2,100 అనామలీస్, 304 నో-మ్యాపింగ్ ఓట్లు గుర్తించినట్లు తెలిపారు. వీటికి సంబంధించి ప్రతిరోజూ 150 చొప్పున నోటీసులు ముద్రించి, గ్రామాల్లో సంబంధిత ఓటర్లకు బీఎల్‌వోల ద్వారా అందజేస్తూ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రెండు నెలల పాటు ఈ పరిశీలన, సవరణ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఓటర్ల వివరాల్లో తప్పులు ఉన్నవారు లేదా మార్పులు చేయించుకోవాల్సిన వారు అవసరమైన ఆధారాలతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తమ వివరాలను సరిచేసుకోవచ్చని సూచించారు.అదేవిధంగా, ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులు లేదా కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునేవారు ఫారమ్-6ను పూర్తి చేసి సంబంధిత బీఎల్‌వోకు లేదా తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.




