Nellore: మూలాపేటలో ఘనంగా శ్రీ ద్రౌపది అమ్మవారి సారె మహోత్సవం!

Nellore: నెల్లూరు మూలాపేట శ్రీకృష్ణ ధర్మరాజస్వామివారి దేవస్థానంలో ఆషాడ మాసం సందర్భంగా శ్రీ ద్రౌపది అమ్మవారికి సారె మహోత్సవం వైభవంగా జరిగింది.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 9 Aug 2026 11:06 PM IST
Nellore
X

Nellore: మూలాపేటలో ఘనంగా శ్రీ ద్రౌపది అమ్మవారి సారె మహోత్సవం!

నెల్లూరు: శ్రీకృష్ణ ధర్మరాజస్వామివారి దేవస్థానం (మూలాపేట, నెల్లూరు ) లో ఆషాడ మాసం సందర్బంగా శ్రీ ద్రౌపది అమ్మవారికి సారె మహోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. నెల్లూరు ఫత్తేఖాన్ పేట, పెండెంవారి వీధిలోని శ్రీ మహాలక్ష్మి మందిరం వద్దనుంచి ద్రౌపది అమ్మ వారి మూర్తి , పాదాలతో పాటు సారె తీసుకుని భక్తులు భాజా భజంత్రీలు , కోలాటాలతో,బాణాసంచాతో ఊరేగింపుగా బయలుదేరి, శ్రీ కృష్ణ ధర్మరాజస్వామి వారి దేవస్థానాని చేరారు.

దేవాలయం లో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉభయకర్తలు శ్రీమతి & శ్రీ నాయుడు. శ్రీనివాసులు - శ్రీమతి స్పందనలు పూజా కార్యక్రమం లో పాల్గొని భక్తులకు పసుపు కుంకుమలు, రవికలు, అలంకరణ వస్తువులు, గోరింటాకు కోన్ లు, పూలు, పండ్లు, అందచేశారు. తధానంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమం లో దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవస్థానం ఈఓ,నెల్లూరుజిల్లా అగ్నికులక్షత్రియ సంఘం నాయకులు, సభ్యులు, స్థానిక అగ్నికులక్షత్రియ బంధుమిత్రులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story