Nellore: గండవరం సర్పంచ్‌కు ఘన వీడ్కోలు.. ముఖ్య అతిథిగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి!

Nellore: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో సర్పంచ్ బొచ్చు రాజకుమారి మరియు వార్డ్ మెంబర్ల పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 April 2026 11:00 AM IST
Nellore
X

Nellore: గండవరం సర్పంచ్‌కు ఘన వీడ్కోలు.. ముఖ్య అతిథిగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి!

నెల్లూరు జిల్లా: కొడవలూరు మండలం గండవరం గ్రామంలో సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ల పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గండవరం గ్రామంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొచ్చు రాజకుమారి, వైస్ సర్పంచ్ ఆలం మాలకొండయ్య మరియు వార్డ్ మెంబర్లకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. గ్రామస్తులు కూడా వారిని సత్కరించారు.

ఈ సందర్భంగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గండవరం గ్రామ అభివృద్ధికి సుమారు 80 లక్షల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. రాబోయే మూడేళ్లలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పారు.

సర్పంచ్‌గా బొచ్చు రాజకుమారి, ఆమె భర్త బొచ్చు సురేష్ ఎంతో నిష్ఠతో పని చేశారని, ప్రజలకు దగ్గరగా ఉండి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. పదవి విరమణ చేసినా వారు తమ కుటుంబ సభ్యుల్లానే ఉంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story