Nellore: కాకాణి వర్సెస్ సోమిరెడ్డి.. నెల్లూరులో ముదిరిన పొలిటికల్ వార్
Nellore: సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య ఇరిగేషన్ పనుల అవినీతిపై రాజకీయం ముదిరింది.
Nellore: కాకాణి వర్సెస్ సోమిరెడ్డి.. నెల్లూరులో ముదిరిన పొలిటికల్ వార్
Nellore: వైకాపా ప్రభుత్వ హయంలో సర్వేపల్లి నియోజకవర్గంలో, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని, సర్వేపల్లి నియోజక వర్గం నీటి సంఘాల నాయకులు నెల్లూరులో మండిపడ్డారు. సర్వేపల్లి నియోజక వర్గంలో ఇరిగేషన్ పనుల్లో పనులు చేయకుండా, బిల్లులు చేసుకున్న చరిత్ర కాకాణి గోవర్ధన్ రెడ్డికే దక్కిందని అన్నారు.
కాని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనులు చేయకుండా బిల్లులు చేసుకున్నాడని కాకాణి గోవర్దన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే మా నీటి సంఘాల పదవులకు రాజీనామాలు చేస్తామన్నారు. నీతి నిజాయితీకి మారు పేరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా కాకాణి గోవర్ధన్ రెడ్డి అసత్య ప్రచారాలు మానుకొని హుందాగా వ్యవహరించాలని హెచ్చరించారు.




