Nellore: సెంట్రింగ్ కార్మికుడిపై రౌడీలతో ఎస్బీఐ ఉద్యోగి బెదిరింపులు!

Nellore: నెల్లూరులో రూ. 1.15 కోట్ల విలువైన బిల్డింగ్ అగ్రిమెంట్ వివాదంలో దారుణం వెలుగు చూసింది.

V. Narasimhulu, Nellore
Published on: 23 May 2026 7:58 PM IST
Nellore
X

Nellore: సెంట్రింగ్ కార్మికుడిపై రౌడీలతో ఎస్బీఐ ఉద్యోగి బెదిరింపులు!

Nellore: నెల్లూరులో రూ.1.15 కోట్లకు కుదిరిన ఓ బిల్డింగ్ వివాదంలో, ఎస్బిఐ ఉద్యోగి, రౌడీ మూకలు కలిసి బాధితుడిని బెదిరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితుడు నెల్లూరు టౌన్, హరినాథపురానికి చెందిన సెంట్రింగ్ కార్మికుడు మామిడి రామాంజనేయులు, నంద్యాల జిల్లా ఆత్మకూరు SBI శాఖలో పనిచేస్తున్న సూర్య వెంకట సాయి తేజ (నిందితుడు) తో,

నెల్లూరు వి. ఆర్.సి. సెంటర్ సోమశేఖరపురంలోని సాయి తేజకు చెందిన జీ+1 బిల్డింగ్ను రూ. 1.15 కోట్లకు కొనేందుకు బాధితుడు 11.03.2026న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అగ్రిమెంట్ చేసుకున్నారు. అడ్వాన్స్ కింద రూ. 16 లక్షలు సాయి తేజ బ్యాంక్ అకౌంట్ కు బదిలీ చేశారు. మిగిలిన సొమ్మును సెప్టెంబర్ 30, 2026 లోపు చెల్లించేలా గడువు పెట్టుకున్నారు.

ఇటీవల భూముల ధరలు పెరగడంతో, ఎక్కువ లాభం కోసం అగ్రిమెంట్ ను రద్దు చేయాలని సాయి తేజ కుట్ర పన్నాడు. బాధితుడుపై రౌడీలతో బెదిరింపులు మొదలెట్టారు. ఈ నెల 17న సాయి తేజ తన అనుచరుడు రాజా సుదర్శనరావు మరియు కొంతమంది రౌడీ మూకలతో కలిసి బాధితుడి ఇంటి పైకి వెళ్లి భయభ్రాంతులకు గురిచేశాడు.

"24 గంటల్లో అగ్రిమెంట్ రద్దు చేయకపోతే తండ్రీకొడుకులను చంపేస్తాం" అని బూతులతో బెదిరించడమే కాకుండా, రాంజీనగర్, హరినాథపురం పరిసరాల్లో చంపడానికి కాపు కాశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మోసానికి పాల్పడి, ప్రాణహాని తలపెడుతున్న బ్యాంక్ ఉద్యోగి సాయి తేజ, రాజా సుదర్శనరావులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని నెల్లూరు 1వ పట్టణ పోలీసులను, డీజీపీని బాధితుడు ఆశ్రయించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story