Rapur: రాపూరు తహసీల్దార్‌కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ వినతిపత్రం!

Rapur: రాపూరు మండలంలో ఎస్సీ, ఎస్టీల రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ లక్ష్మీ నరసింహకు అట్రాసిటీ కమిటీ అధ్యక్షుడు కొప్పల అంకేష్ వినతిపత్రం ఇచ్చారు.

Yellayya, Nellore
Published on: 15 Sept 2026 9:42 PM IST
Rapur
X

Rapur: రాపూరు తహసీల్దార్‌కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ వినతిపత్రం!

రాపూరు: నెల్లూరు జిల్లా రాపూరు మండల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అధ్యక్షులు కొప్పల అంకేష్ మంగళవారం రాపూరు మండల రెవెన్యూ అధికారి లక్ష్మీ నరసింహ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

అనంతరం రాపూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ ప్రజలు రెవెన్యూ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి లక్ష్మీ నరసింహ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు. సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు మండల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అధ్యక్షులు కొప్పల అంకేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore