Narasimhakonda: శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు

Narasimhakonda: నరసింహకొండ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు. వైభవంగా శేషవాహన సేవ, గిరి ప్రదక్షిణ ఉత్సవం.

A Praveen, Nellore
Published on: 20 Aug 2026 6:40 AM IST
Narasimhakonda
X

Narasimhakonda: శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు

Narasimhakonda: నెల్లూరు రూరల్ మండలం, నరసింహకొండ పై వేదగిరి క్షేత్రముగా వెలసియున్న శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం నందు స్వాతి నక్షత్రము విశేష పర్వదినం సందర్భంగా స్వామివారికి శేషవాహన సేవ గిరి ప్రదక్షిణ ఉత్సవము వైభవముగా జరిగినది. జొన్నవాడ అర్చకులు శ్రీశైలం రామ్మోహన్ శర్మ శ్రీమతి కామేశ్వరి దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఉభయ కర్తలుగా వ్యవహరించారు.

దేవస్థానము అర్చక స్వాములు మాధవగిరి వెంకట కృష్ణమాచార్యులు, అలంకార, అర్చక కైంకర్యములో వేదం మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యములు, భక్తుల గోవింద నామ స్మరణలతో వైభవముగా జరిగినది. ఈ కార్యక్రమములో దేవస్థానము చైర్మన్ ఇందుపూరు అచ్యుత శంకర రెడ్డి, దేవస్థానము అర్చక స్వాములు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ తీర్ధ ప్రసాదము వితరణ జరిగినది.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story