Nellore: నెల్లూరులో అక్టోబర్ 18న 'సింహపురి వైభవం' విజయదశమి వేడుకలు!
Nellore: నెల్లూరు టౌన్ హాల్‌లో అక్టోబర్ 18న సింహపురి వైభవం విజయదశమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కొండూరు హరి నారాయణ రెడ్డి ట్రస్ట్ అధ్యక్షుడు తెలిపారు.
Nellore: నెల్లూరులో అక్టోబర్ 18న 'సింహపురి వైభవం' విజయదశమి వేడుకలు!
Nellore: సింహపురి వైభవం. విజయదశమి వేడుకలు అక్టోబర్18 ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు టౌన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు కొండూరు హరి నారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్. కొండూరు హరి నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం టౌన్ హాల్ స్టేజిపై జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు చెందిన సాహితీ సంస్కృతిక సంస్థలను వాకర్స్ సంఘాలను ఇతర ప్రముఖులను ఘనంగా సత్కరించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రముఖ నటుడు సింగంశెట్టి మురళీ మోహన్ రావు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో తొలిసారి ఆర్థిక. సామాజిక. సాహితీ సంస్కృతిక. సేవా రంగాల్లో సేవలందించిన వారిని సత్కరించడం అభినందనీయమన్నారు. సింహపురి ప్రజలందరూ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్. సృజన రాధాకృష్ణ.ఎండి నగ్మా.. Sv సత్యనారాయణ. ఎస్కే అబ్దుల్ మజీద్ . కే.సీనయ్య. శ్రీ నాగరాజు.. మారి తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల సంస్థల అధినేతలు ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. 7893847709.




