Chinnabazar: చిన్నబజార్ సీఐగా సీతారామయ్య బాధ్యతల స్వీకరణ

Chinnabazar: నెల్లూరు చిన్నబజార్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా సీతారామయ్య బాధ్యతలు చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

A Praveen, Nellore
Published on: 3 Oct 2026 6:16 PM IST
Chinnabazar
X

Chinnabazar: చిన్నబజార్ సీఐగా సీతారామయ్య బాధ్యతల స్వీకరణ

చిన్నబజార్: నెల్లూరు నగరంలోని చిన్నబజార్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా సీఐ సీతారామయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పగించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో, బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని తెలిపారు.

చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని సీఐ సీతారామయ్య పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.

నెల్లూరులో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలను ఉపేక్షించబోమని తెలిపారు.

ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని సీఐ సీతారామయ్య కోరారు. చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

A Praveen, Nellore

A Praveen, Nellore