Nellore: సోనాం వాంగ్చుక్ దీక్షపై కేంద్రం స్పందించాలి!
Nellore: దిల్లీలో సోనాం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా నెల్లూరులో ప్రజా సంఘాల వేదిక సభ. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్.
Nellore: సోనాం వాంగ్చుక్ దీక్షపై కేంద్రం స్పందించాలి!
Nellore: "ప్రభుత్వ పరిపాలనలో న్యాయం మరియు జవాబుదారీతనం ఉండాలి" అనే ఉద్దేశ్యంతో ప్రొఫెసర్ సోనాం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇప్పటికీ 19 రోజుల్లో పూర్తయి 20వ రోజు జరుగుతున్నది. వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని తెలిపారు. వారి ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.
ఇటీవల జరిగిన NEET ఎగ్జామినేషన్స్ పేపర్ లీకేజీ వల్ల, 20 మంది పైగా విద్యార్థులు చేసుకున్న ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ, ప్రముఖ శాస్త్రవేత్త, సామాజికవేత్త, పర్యావరణవేత్త, అభ్యుదయవాదీ, నిష్కలంగా దేశభక్తులు అయిన శ్రీ సోనాం వాంగ్చుక్ 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలుచేస్తున్న విషయాన్ని ప్రజాసంఘాల సభ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేస్తున్న సోనాం వాంగ్చుక్ ఆరోగ్యంపై సత్వరం కేంద్రం దృష్టి పెట్టాలని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేశాయి.ప్రొఫెసర్ ఆరోగ్యంపై ప్రజల సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర స్థాయిలో ప్రవేశ పరీక్షల్లో జరిగిన వరుస లీకేజీలకు
నైతిక బాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ... ప్రముఖ శాస్త్రవేత్త, సామాజికవేత్త, పర్యావరణవేత్త, అభ్యుదయవాదీ, నిస్వార్ధ దేశభక్తులు సోనాం వాంగ్చుక్ గారు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ప్రజా ఆందోళన చెసేందుకు సంఘాలు సమావేశమయ్యాయి.సోనాం వాంగ్చుక్ ఆరోగ్యం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటికే సోనాం వాంగ్చుక్ ను పరిశీలించిన వైద్య బృందాలు...దీక్ష కొనసాగితే ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారుతుందంటూ హెచ్చరిక చేశాయి.
ప్రపంచం గర్వించదగిన స్థాయి మేధావి, ప్రజాసేవకుడుగా ఉన్న...సోనాం వాంగ్చుక్ ను రక్షించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని చొప్పా రవీంద్రబాబు చెప్పారు. సోనాం వాంగ్చుక్ ఆరోగ్యం పై వైద్య బృందాలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో కేంద్రం రంగాల్లోకి దిగాలని... ఆయన డిమాండ్లకు అంగీకారం తెలపాలని ప్రజా సంఘాల సభ డిమాండ్ చేసింది. సోనాం వాంగ్చుక్ ఆరోగ్యానికి ముప్పు వాటిలితే దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, విద్యార్థులు యువజనలు మరియు అభ్యుదయవాదులు, ఏకమై ఆందోళన చేస్తాయని సభ కేంద్రానికి హెచ్చరికలు చేసింది.
కేంద్ర స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలు పాలన విధానాల్లో జరుగుతున్న లోపాలు అవినీతి జాడ్యం పై దేశం గర్వించదగ్గ ఒక ప్రొఫెసర్ ఇన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న ఆమరణ దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి,, జవాబుదారీతనం లేదు అనేందుకు.. నిదర్శనమని ప్రజాసంఘాల వేదిక సభ విమర్శించింది.
సమావేశం లో విశ్రాంత ఉద్యోగ సంఘాల నాయకులు చొప్పా రవీంద్రబాబు, జన విజ్ఞాన వేదిక నాయకులు జి. మాల్యాద్రి, ఎం.వి.చలపతి, OPDR నాయకులు సుబ్బారెడ్డి,పౌర హక్కుల సంఘం నాయకులు వెల్లంకి వెంకటేశ్వర్లు, శివశంకర్, చలనం జాషువా, ప్రగతిశీల ప్రజా వేదిక నాయకులు శరవణ, SFI నాయకులు నరేంద్ర, విశ్రాంత ఉపాధ్యాయ సంఘాల నాయకులు EV నారాయణ, సుందర రాజన్, రైతు నాయకులు గంగపట్నం రమణయ్య, ఆది బోగోలు మండల అధ్యక్షులు శ్రీరాములు, కనుపూరు శ్రీనివాసులు, బీసీ వెల్ఫేర్ ఉద్యోగుల మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఐ. కృష్ణయ్య, VROs అసోసియేషన్ జిల్లా మాజీ అధ్యక్షులు పంట అశోక్ కుమార్ రెడ్డి, పౌర హక్కుల సంఘం నాయకులు వెల్లంకి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.




