Nellore: నేరగాళ్లకు చెక్.. రంగంలోకి పోలీసు డ్రోన్ కెమెరాలు!

Nellore: జిల్లాలో నేరాల నియంత్రణకు ఎస్పీ అజిత వేజెండ్ల కీలక ఆదేశాలు జారీ చేశారు. నగర శివారు ప్రాంతాలు, క్రైమ్ ప్రోన్ ఏరియాల్లో రాత్రివేళ డ్రోన్తో నిఘా ఏర్పాటు చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 28 April 2026 2:21 PM IST
Nellore
X

Nellore: నేరగాళ్లకు చెక్.. రంగంలోకి పోలీసు డ్రోన్ కెమెరాలు!

Nellore: జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, నేరాల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా డ్రోన్ నిఘా నిర్వహిస్తున్నారు. పట్టణం, శివారు ప్రాంతాలు మరియు క్రైమ్ ప్రోన్ ఏరియాలలో డ్రోన్ కెమెరాలతో రాత్రిపూట నిఘా ఉంచి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట, ఈవ్ టీజింగ్, దొంగతనాలు వంటి నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి డ్రోన్ పర్యవేక్షణ చేపడుతూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద విషయాలను గమనిస్తే 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు.

ప్రజలు ఈ సమాచారం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్లను ఉపయోగించుకోవాలని.. ప్రజల సహాయ సహకారాలు అందిస్తేనే అసాంఘిక కార్యకలాపాలు సమూలంగా అంతమొందించేందుకు అవకాశం ఉంటుందని, ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలతో, నిఘా ఏర్పాటు చేశామని, ప్రత్యేకంగా డ్రోన్ నిఘా నీడలో నగర శివారు ప్రాంతాల్ని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story