Nellore: గంగమ్మ తల్లి ఆలయంలో కన్నులపండువగా వార్షికోత్సవం!
Nellore: సంగం మండల కేంద్రంలోని నిమ్మతోపు సెంటర్ శ్రీ గంగమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
Nellore: గంగమ్మ తల్లి ఆలయంలో కన్నులపండువగా వార్షికోత్సవం!
నెల్లూరు: నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని నిమ్మతోపు సెంటర్ లో వేంచేసియున్న శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు కన్నులపండువగా నిర్వహించారు. ఉదయాన్నే స్థానిక మహిళలు పెన్నానదికి చేరుకుని, పుణ్యజలాలతో కలశాలను నింపుకుని తప్పెట్ల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.
అనంతరం పెన్నానది నీటితో గంగమ్మ తల్లికి విశేష అభిషేకాలు జరిపారు.ఈ సందర్భంగా మహిళలు ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో పొంగళ్ళు సమర్పించి అమ్మవారికి నైవేద్యం పెట్టారు. స్థానిక పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Next Story




