Vinjamuru: వింజమూరు వద్ద శ్రీ తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా!
Vinjamuru: హైదరాబాద్ నుంచి ఏఎస్పేట వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా! వింజమూరు కాశీనాయన ఆశ్రమం వద్ద ఘటన, నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉండటంతో తప్పిన ప్రమాదం.
Vinjamuru: వింజమూరు వద్ద శ్రీ తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా!
Vinjamuru: హైదరాబాద్ నుంచి ఏఎస్పేటకు వెళ్తున్న శ్రీ తులసి ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. వింజమూరు మండలం చద్రపడియా గ్రామ సమీపంలోని కాశీనాయన ఆశ్రమం వద్ద శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం బస్సు హైదరాబాద్ నుంచి ఏఎస్పేట వైపు వెళ్తుండగా కాశీనాయన ఆశ్రమం వద్ద ఎదురుగా ఓ ఆటో వచ్చింది.
ఆటోకు సైడ్ ఇచ్చే క్రమంలో బస్సు రోడ్డు మార్జిన్ దిగడంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం.ప్రమాద సమయంలో బస్సులో కేవలం నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు.దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.బస్సు డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




