Nellore: వెంగమాంబ తిరునాళ్లు.. ‘సమ్మక్క–సారక్క’ తర్వాత అంతటి ఉత్సవం!
Nellore: నర్రవాడలో కొలువుదీరిన శ్రీ వేంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలు, తిరునాళ్లు అశేష భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
Nellore: వెంగమాంబ తిరునాళ్లు.. ‘సమ్మక్క–సారక్క’ తర్వాత అంతటి ఉత్సవం!
నెల్లూరు: తెలుగు రాష్ట్రాల్లో సమ్మక్క సారక్క తిరణాల తర్వాత అశేష భక్త జన సందోహం తరలివచ్చే అమ్మవారి ఉత్సవాలలో ఒకటిగా ఉన్నా నెల్లూరు జిల్లా నరవాడలోని శ్రీ వేంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలు తిరునాళ్లు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
కొద్దిసేపటిక్రితం భక్తిశ్రద్ధలతో మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు ఆలయ శాశ్వత ధర్మతకర్తలే మండలి చైర్మన్ అధికారులు అమ్మవారి వంశస్థులు అశేష భక్తజనం మధ్య శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల తొలి రోజు సాయం సంధ్యా వేళ ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కళకళలాడింది. ఈ రాత్రి సంప్రదాయబద్ధంగా నిర్వహించే పసుపు దంచే కార్యక్రమంతో అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టం జరుగుతుంది.
బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ చైర్మన్ వేమూరి ముసలయ్య పరిశీలించారు. లక్షలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉందని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామని ఆలయ నిర్వహణ కమిటీ చైర్మన్ ముసలయ్య నాయుడు తెలిపారు.
వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా నరవాడ అమ్మవారి పుట్టిల్లు వడ్డిపాలెం లలో అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఆలయ ఈవో ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.భక్తుల కోసం త్రాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు, అన్నదాన కార్యక్రమాలు, విశ్రాంతి కేంద్రాలతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వెల్లడించారు.
ఆగమన శాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పెద్ద భద్రయ్య చెప్పారు.శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విశిష్ట ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందన్నారు. ఈ రాత్రి నిర్వహించే పసుపు దంచే కార్యక్రమం అత్యంత పవిత్రమైన ఘట్టమని తెలిపారు. అనంతరం జరిగే రథోత్సవాలు, కళ్యాణోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయని వివరించారు.
నరవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు తిరునాళ్ల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేసినట్లు ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో డ్రోన్ కెమెరా నిఘా తో పాటు. భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఉత్సవాలకు దాదాపు 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, క్యూలైన్ల నిర్వహణతో పాటు ప్రత్యేక చర్యలు చేపట్టామని, ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.




