Kaluvaya: సెన్సస్ పేరుతో చెక్కేసిన స్టాఫ్.. కలువాయిలో సామాన్యుల గోస!
Kaluvaya: నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో సచివాలయాల తీరుపై ప్రజల ఆగ్రహం. సచివాలయం 1, 2, 3లలో కానరాని సిబ్బంది.
Kaluvaya: సెన్సస్ పేరుతో చెక్కేసిన స్టాఫ్.. కలువాయిలో సామాన్యుల గోస!
కలువాయి: నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ప్రజలకు సేవలు అందించాల్సిన సచివాలయాలు మూగబోయినట్టుగా మారాయని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలువాయిలోని సచివాలయం 1, 2, 3 పరిధిలో ఒక్క ఉద్యోగి కూడా అందుబాటులో లేకపోవడంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1బి, అడంగల్, కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం గత మూడు రోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నామని అర్జీదారులు మీడియాకు తెలిపారు. సచివాలయ సిబ్బందిని ప్రశ్నించగా అందరూ సెన్సస్ సర్వే విధుల్లో ఉన్నారని సమాచారం ఇవ్వడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో ఉద్యోగులు ఎవరూ లేకపోయినా లైట్లు, ఫ్యాన్లు నిరంతరం ఆన్‌లో ఉండటంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి,ప్రజలు కార్యాలయానికి వచ్చినా వారి సమస్యలు వినేందుకు, కనీస సమాచారం ఇవ్వడానికి కూడా ఎవరూ లేకపోవడం దారుణమని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించాల్సిన సచివాలయాల్లో ఈ పరిస్థితిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




