Udayagiri: 396 జీవో రద్దు కోసం ఉదయగిరిలో స్టాంపు రైటర్ల ఒంటికాలి ధర్నా!

Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట స్టాంపు రైటర్లు వినూత్న నిరసన చేపట్టారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 28 July 2026 1:34 PM IST
Udayagiri
X

Udayagiri: 396 జీవో రద్దు కోసం ఉదయగిరిలో స్టాంపు రైటర్ల ఒంటికాలి ధర్నా!

Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 396 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టాంపు రైటర్లు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. ఉదయగిరి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట పెన్‌డౌన్ నిర్వహించిన స్టాంపు రైటర్లు, ఒంటికాలిపై నిలబడి ధర్నా చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, "396 జీవోను వెంటనే రద్దు చేయాలి" అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

396 జీవో అమలుతో తమ ఉపాధి పూర్తిగా దెబ్బతింటోందని, ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న స్టాంపు రైటర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవోను రద్దు చేసి తమ జీవనోపాధిని కాపాడాలని కోరారు.డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని స్టాంపు రైటర్లు హెచ్చరించారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI

Next Story