Nellore: రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు నెల్లూరు టీమ్ సిద్ధం
Nellore: నెల్లూరు జిల్లా దువ్వూరులో రేపటి నుండి రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయి.
Nellore: రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు నెల్లూరు టీమ్ సిద్ధం
Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో రేపటి నుండి జరిగే రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోటీలకు నెల్లూరు జిల్లా నుండి మహిళలు,పురుషుల జట్ల ఎంపిక ప్రక్రియ పూర్తైంధని జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సతీష్ తెలిపారు. ఈ ఎంపికలో భాగంగా ముందుగా 16 మంది పురుషులు, 10 మంది మహిళా క్రీడాకారులను ఎంపిక చేయగా, వారిలో ప్రతిభ కనబరిచిన 6 మంది పురుషులు, 6 మంది మహిళలను తుది జట్లలోకి ఎంపిక చేశామని చెప్పారు.
ఎంపికైన క్రీడాకారులకు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి కిట్లను అందజేశారు. ఈనెల 7 నుంచి 10 వరకు దువ్వూరు గ్రామంలో రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. విశేషంగా, 26 జిల్లాల నుంచి మహిళలు, పురుషుల జట్లు పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం అని అన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు క్రీడాకారులకు భోజనం, వసతి సౌకర్యాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
నెల్లూరు జిల్లా జట్టులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సునీల్, నవీన్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఉండటం జిల్లాకు గర్వకారణంగా నిలుస్తోందని తెలిపారు. ఈ పోటీల్లో నెల్లూరు జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుందని సతీష్ ఆశాభావం వ్యక్తం చేశారు.జిల్లా క్రీడాభిమానులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు మారెళ్ల శ్రీనివాసులు,దయాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




