Nellore: బిక్షాటన చేయిస్తే జైలు శిక్షే.. తల్లిదండ్రులకు అధికారుల హెచ్చరిక!
Nellore: నెల్లూరు జిల్లాలో భిక్షాటన చేస్తున్న పిల్లల కోసం ప్రత్యేక డ్రైవ్. బాలల న్యాయ చట్టం ప్రకారం కఠిన హెచ్చరికలు జారీ చేసిన అధికారులు.
Nellore: బిక్షాటన చేయిస్తే జైలు శిక్షే.. తల్లిదండ్రులకు అధికారుల హెచ్చరిక!
Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ హిమాన్షుక్లా బిక్షాటన చేసే బాలల కోసం ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ పర్యవేక్షణలో భిక్షాటన నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది. ఈ స్పెషల్ డ్రైవ్ ను డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ బి. సురేష్ సారధ్యం లో నిర్వహించారు. ఈ కార్యక్రమం నెల్లూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, వీఆర్‌సీ సెంటర్, ఆత్మకూరు బస్టాండ్ మరియు అయ్యప్ప గుడి సెంటర్ ప్రాంతాల్లో భిక్షాటన చేసే వారిని గుర్తించి వాళ్లను రెస్క్యూ చేయడం జరిగింది.
డీసీపీయూ, ఏహెచ్‌టీయూ మరియు NGOs, సి డబ్ల్యూ సి సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన ఈ డ్రైవ్‌లో భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి ,. భిక్షాటన వల్ల కలిగే నష్టాలు బిక్షాటన చెపిస్తే వారిపైన , బాలల న్యాయ చట్టం సెక్షన్ 76 వివరణ
(1) భిక్షాటన ప్రయోజనం కోసం ఏదేని బాలుడిని పనిలో పెట్టుకున్నా లేదా ఉపయోగించుకున్నా, లేదా ఏదేని బాలుడిని భిక్షాటన చేయించినా, అటువంటి వ్యక్తికి ఐదు సంవత్సరాల వరకు పొడిగించబడే కారాగార శిక్ష మరియు ఒక లక్ష రూపాయల జరిమానా కూడా విధించబడుతుంది:
అయితే, భిక్షాటన ప్రయోజనం కోసం ఆ వ్యక్తి బాలుడి అవయవాలను కోసివేసినా లేదా వికలాంగుడిని చేసినా, అటువంటి వ్యక్తికి ఏడు సంవత్సరాల కంటే తక్కువ కాకుండా పది సంవత్సరాల వరకు పొడిగించబడే కఠిన కారాగార శిక్ష మరియు ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా విధించబడుతుంది.
(2) పిల్లవాడిపై వాస్తవ బాధ్యత లేదా నియంత్రణ కలిగి ఉండి, ఉప-విభాగం (1) కింద నేరం చేయడానికి ప్రేరేపించే ఎవరైనా, ఉప-విభాగం (1) లో అందించిన అదే శిక్షతో శిక్షించబడతారు మరియు అటువంటి వ్యక్తి సెక్షన్ 2 యొక్క క్లాజ్ (14) యొక్క ఉప-క్లాజ్ (v) కింద అనర్హుడిగా పరిగణించబడతారు:
అయితే, సదరు పిల్లవాడు, ఏ పరిస్థితులలోనూ చట్టంతో సంఘర్షణలో ఉన్న పిల్లవాడిగా పరిగణించబడడు, మరియు అటువంటి సంరక్షకుడు లేదా కస్టోడియన్ యొక్క బాధ్యత లేదా నియంత్రణ నుండి తొలగించి, తగిన పునరావాసం కోసం కమిటీ ముందు హాజరుపరచబడాలి. అవగాహన కల్పించి, వారిని మహిళా శిశు సంక్షేమ & సాధికారత అధికారిణి శ్రీమతి బి. హేనా సుజనా గారి సమక్షంలో హాజరుపరచి కౌన్సిలింగ్ అందించడం జరిగింది
మొత్తం ఐదు మంది లో ఒక బాలుడు,4 గురు బాలికలు గుర్తించి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చివారిని సిడబ్ల్యుసి వారి ఆదేశాల మేరకు తల్లిదండ్రులకు అప్పగించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారిని బిహేనాసిజన్ తల్లిదండ్రులను ఆ పిల్లలను భిక్షాటనకు ఎందుకు పంపిస్తున్నారని అడుగగా తల్లిదండ్రులు సెలవుల సమయంలో పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా భిక్షాటనకు వచ్చారని తల్లిదండ్రులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీపీవో బి. సురేష్, సుమలత, రత్నం, సుజాత, శైలజ, AHTU సిబ్బంది ASI లు వై.శ్రీహరి, D.సతీష్ సిబ్బంది TVS రాంబాబు మరియు ఎన్జీవో ప్రతినిధులు మునవర్, శంకర్ పాల్గొన్నారు.




