Sullurpeta: చరిత్ర తిరగరాసిన మహిళా నేత డాక్టర్ నెలవల విజయశ్రీ!
Sullurpeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మొదటి మహిళా ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన డాక్టర్ నెలవల విజయశ్రీ, నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారు.
Sullurpeta: చరిత్ర తిరగరాసిన మహిళా నేత డాక్టర్ నెలవల విజయశ్రీ!
Sullurpeta: తిరుపతిజిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గ రాజకీయ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం లిఖించబడింది. గత చరిత్రను తిరగేస్తే ఈ నియోజకవర్గం నుంచి ఏ ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు లేవు. కానీ, ఆ చరిత్రను తిరగరాస్తూ డాక్టర్ నెలవల విజయశ్రీ ఎమ్మెల్యేగా చారిత్రాత్మక విజయం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించారు.
రాజకీయాల్లో ఎలాంటి ప్రత్యక్ష అనుభవం లేకపోయినప్పటికీ, ఆమె సాధించిన ఈ విజయం సామాన్యమైనదేమీ కాదు. తండ్రి మాజీ ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ, ఆయన నీడలో మాత్రమే ఉండిపోకుండా విజయశ్రీ ఒక పోరాట యోధురాలిగా నేరుగా ప్రజల్లోకే వెళ్లారు.
నిత్యం ఓటర్ల మధ్యే ఉంటూ, వారి కష్టసుఖాలను స్వయంగా తెలుసుకుంటూ ప్రజాక్షేత్రంలో పటిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.వృత్తిరీత్యా వైద్యురాలైన డాక్టర్ విజయశ్రీ, ఒక డాక్టర్ రోగికి ఉన్న వ్యాధిని పసిగట్టి నయం చేసినట్లే, నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న రుగ్మతలను, సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపుతున్నారు.
రోజుకి రెండు మూడు కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఏమాత్రం అలసట చెందకుండా, విశ్రాంతిని పక్కనపెట్టి నిత్యం ప్రజాసేవలోనే నిమగ్నమవుతున్నారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ బాధ్యతలను భుజాన వేసుకుని, సమస్య చిన్నదైనా పెద్దదైనా స్వయంగా పరిశీలిస్తున్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తూ, ప్రతి ఒక్కరి మాటను ఎంతో ఓపికగా వింటున్నారు.
అనంతరం సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. మాట్లాడే విధానంలో గానీ, సమస్యల పరిష్కారంలో గానీ ఆమె చూపిస్తున్న చొరవను చూసి నియోజకవర్గ ప్రజలు అశ్చర్యపోతున్నారు.
ఎంతటి క్లిష్టమైన విషయమైనా సరే ధైర్యంగా వినడం, స్పందించడంలో ఆమె ఏమాత్రం తగ్గడం లేదు. "మహిళలు మనస్ఫూర్తిగా కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు" అని తన రోజువారీ పనితీరు ద్వారా విజయశ్రీ నిరూపిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.
ఎలాంటి సమస్య ఉన్నా ఎమ్మెల్యే గారిని కలిస్తే పరిష్కారం లభిస్తుందనే బలమైన నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడంలో ఆమె ముందంజలో ఉన్నారు. నిత్యం ప్రజల్లో తిరుగుతూ, వారి కష్టాల్లో తోడుగా నిలుస్తున్న డాక్టర్ నెలవల విజయశ్రీపై నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ప్రజాదరణే ఆమెను నియోజకవర్గంలో ఒక తిరుగులేని నాయకురాలిగా నిలబెడుతోంది.




