Sarvepalli: తోటపల్లిగూడూరు మండలంలో రూ.1.55 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం!
Sarvepalli: తోటపల్లిగూడూరు మండలం మాచర్లవారిపాళెంలో రూ.1.55 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Sarvepalli: తోటపల్లిగూడూరు మండలంలో రూ.1.55 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం!
Sarvepalli: తోటపల్లిగూడూరు మండలం మాచర్లవారిపాళెంలో రూ.1.55 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కార్యక్రమాలలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు.మాచర్ల వారి పాలెం గ్రామంలో స్థానిక టిడిపి నేత పొన్నలూరు శివకోటారెడ్డి రాష్ట్ర నూర్ భాషాదూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అల్తాఫ్ స్థానిక టిడిపి నేతల ఆధ్వర్యంలో సోమిరెడ్డికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమాచర్లవారిపాళెం పంచాయతీలో ఈ రోజు రూ.1.55 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ.11 వేల కోట్లతో చేపట్టిన పల్లె పండగ 3.0 కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి రూ.11 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని,రూ.13 కోట్లకు పైగా నుడా నిధులతో అనేక పనులు చేపట్టామని అలాగే పల్లె పండగ 3.0లో భాగంగా తోటపల్లి గూడూరు మండలంలో రూ.2.20 కోట్లతో చేపట్టే పనులకు మండల కేంద్రంలో శంకుస్థాపనలు చేయడం జరిగిందని అన్నారు.
మాచర్లవారిపాళెం పంచాయతీ పరిధిలోని రామలింగాపురం వద్ద SEIL కంపెనీ సీఎస్ఆర్ నిధులు రూ.30 లక్షలతో నిర్మించిన వాటర్ ప్లాంట్ ప్రారంభించారు.
పల్లె పల్లెనా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు.
గణపతినగర్ వద్ద రూ.49.30 లక్షలతో నిర్మించిన తాగునీటి ట్యాంకు ప్రారంభోత్సవం చేశారు.పల్లె పండగ 3.0 నిధులు రూ.15 లక్షలతో గణపతి నగర్ లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మాచర్లవారిపాళెంలో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ఓపెన్ చేశారు.
ఇవి గాక నుడా నిధులు రూ.1.60 కోట్లతో పొదలకూరులో సెంట్రల్ లైటింగ్, రూ.40 లక్షలతో పేడూరు, వెంకన్నపాళెంలో హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.తోటపల్లిగూడూరు నుంచి నక్కావారిపాళెం వరకు రూ.3 కోట్లతో రోడ్డు నిర్మాణం జరుగుతోందని అన్నారు.
స్ధానిక సంస్థల ఎన్నికలతో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపును కూడా వైసీపీ అడ్డుకుంటోంది,ఎస్సీ, ఎస్టీల ప్రాతిధ్యం తగ్గకుండా బీసీల జనాభాప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తుంటే కడుపుమండి కోర్టులో కేసులు వేసి అడ్డంకులు కల్పిస్తున్నారని తెలిపారు.
రూ.లక్ష కోట్లతో రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయడం సంతోషం,ఈ ప్రాజెక్టులో నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలను కూడా భాగం చేయాలని ముఖ్యమంత్రిని కలిసి కోరుతానని ఆయన అన్నారు.
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తుండటంతో యువతకు ఉపాధి అవకాశాలు భారీగా వస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమాలలో టిడిపి రాష్ట్ర నేత బొమ్మి సురేంద్ర రాష్ట్ర నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అల్తాఫ్ జాఫర్ సాహెబ్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విజయ డైరీ డైరెక్టర్ కోడూరు శ్రీనివాసులురెడ్డి రెడ్డిమండల పార్టీ ప్రధాన కార్యదర్శి
మన్యం జితేంద్ర గౌడ్ మధుసూదన్ గౌడ్తో టపల్లి గూడూరు సొసైటీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి పేడూరు సొసైటీ అధ్యక్షులు గూడూరు నారాయణ గండవరం సోమశేఖర్ రెడ్డి ముంగల దొరువుయువ నేత మొగిలిగుంట పోతన.
సర్వేపల్లి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాసులుకావల్ రెడ్డి శ్యాంసుందర్ రెడ్డి తలమంచి నాగేశ్వరరావు ముత్యాల గణేష్ ఏఎంసి డైరెక్టర్ సుస్మితా రెడ్డిఈదూరు నేతలుఅనిల్ నాయుడు వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.




