Nellore: రాపూరులో ఘనంగా ముగిసిన వేసవి విజ్ఞాన శిబిరం

Nellore: నెల్లూరు జిల్లా రాపూరు గ్రంథాలయంలో అట్టహాసంగా ముగిసిన వేసవి విజ్ఞాన శిబిరం. పుస్తక పఠనం ప్రాధాన్యతను చాటిచెప్పిన వక్తలు.

V. Narasimhulu, Nellore
Updated on: 7 Jun 2026 3:30 PM IST
Nellore
X

Nellore: రాపూరులో ఘనంగా ముగిసిన వేసవి విజ్ఞాన శిబిరం

నెల్లూరు జిల్లా: రాపూరు స్థానిక శాఖ గ్రంథాలయంలో గత కొన్ని రోజులుగా విద్యార్థుల కోసం ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం సమ్మర్ క్యాంప్ ఆదివారం అట్టహాసంగా ముగిశాయి ఈ ముగింపు వేడుకలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు,పుస్తక ప్రేమికులు హాజరయ్యారు.​

పుస్తక పఠనమే ఉత్తమ మార్గం ​ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ, నేటి ఆధునిక డిజిటల్ యుగంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు, టీవీలకు పరిమితమై విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వాటికి దూరంగా ఉంటూ,పుస్తక పఠనం వైపు మొగ్గు చూపాలని వారు సూచించారు.గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కావని, విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే విజ్ఞాన గనులని వారు అభివర్ణించారు.​

విద్యార్థులకు కీలక సూచనలు ​సమ్మర్ క్యాంప్ ముగిసినంత మాత్రాన గ్రంథాలయంతో సంబంధం తెగిపోకూడదని వక్తలు హితవు పలికారు.ప్రతి విద్యార్థి వారానికి కనీసం ఒక్కసారైనా రాపూరు గ్రంథాలయాన్ని సందర్శించి,కథల పుస్తకాలు,ప్రముఖుల జీవిత చరిత్రలు, జనరల్ నాలెడ్జ్ గ్రంథాలను చదవడం అలవాటు చేసుకోవాలని కోరారు.

పుస్తకాలను స్నేహితులుగా చేసుకున్న వారే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అని వారు ఆకాంక్షించారు.​ ప్రతిభావంతులకు బహుమతుల ప్రదానం ​వేసవి శిబిరంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్, క్విజ్, వ్యాసరచన, కథలు చెప్పడం వంటి పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు,ప్రశంస పత్రాలను అందజేశారు.​

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి అంజయ్య, ప్రధానోపాధ్యాయులు కోలా వెంకట నాగేశ్వరరావు, యస్.ర్. పంతులు, జూనియర్ కళాశాల లెక్చరర్ సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story