Nellore: పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యం: జిల్లా ఎస్పీ!

Nellore: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డా. అజిత వెజెండ్ల ఆధ్వర్యంలో 'డయల్ యువర్ యస్.పి.' (SP-సంపర్క్) కార్యక్రమం జరిగింది.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 7 Aug 2026 11:58 PM IST
Nellore
X

Nellore: పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యం: జిల్లా ఎస్పీ!

నెల్లూరు: జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా యస్.పి.డా. అజిత వెజెండ్ల ‘డయల్ యువర్ యస్.పి.’ (SP-సంపర్క్) కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఈ రోజు సాయంత్రం 3.00 గం నుండి 5.00 వరకు నిర్వహించారు. ప్రతి శుక్రవారం జరిగే ఈ కార్యక్రమం ద్వారా సిబ్బంది నేరుగా ఫోన్ ద్వారా తమ సమస్యలను యస్.పి. కి తెలియజేసే అవకాశం కల్పించబడింది.

నేటి కార్యక్రమంలో 16 మంది పోలీసు సిబ్బంది ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలియజేశారు. అందులో ముఖ్యముగా వారి బదిలీలు, సస్పెన్షన్ రివోక్ మరియు ఇతర పరిపాలనా అంశాల సంబందించిన అభ్యర్థనలు. జిల్లా ఎస్పీ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ప్రోగ్రాం నందు జిల్లా ఎస్. పి తో పాటు, AO చంద్ర మౌళి, A సూపరింటెండెంట్ సురేష్ , మరియు B సూపరింటెండెంట్ మస్తాన్ రావు, SB2 CI శ్రీనివాస రెడ్డి PGRS సిబ్బంది పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story