Marripadu: స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా ట్రై సైకిళ్ల అందజేత
Marripadu: మర్రిపాడు మండలంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 26 చెత్త సేకరణ ట్రై సైకిళ్ల పంపిణీ.
Marripadu: స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా ట్రై సైకిళ్ల అందజేత
Marripadu: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ ఆవరణంలో చెత్త సేకరణ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు మండల అభివృద్ధి అధికారి నాగేశ్వరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరికట్లజనార్ధన్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి 24 పంచాయతీలకు గాను 26 చెత్త బండ్లను పారిశుధ్య కార్మికులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సచివాలయ డిప్యూటీ ఎంపీడీవో నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఇంటి చెత్త సేకరణను మరింత పటిష్టం చేసి స్వచ్ఛ ఆంధ్ర సాధించడమే లక్ష్యంగా ఈ ట్రై సైకిళ్లను అందజేసినట్లు అధికారులు తెలిపారు.




