Nellore: బడి నుంచే స్వచ్ఛత పాఠాలు.. నెల్లూరులో మేయర్, కమిషనర్ సందడి!

Nellore: నెల్లూరు వి.ఆర్. ఎం.సి హై స్కూల్‌లో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. మేయర్ దేవరకొండ సుజాత చేతుల మీదుగా ప్లాస్టిక్ రహిత ప్రచారం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 10:33 AM IST
Nellore
X

Nellore: బడి నుంచే స్వచ్ఛత పాఠాలు.. నెల్లూరులో మేయర్, కమిషనర్ సందడి!

Nellore: నెల్లూరు నగరంలోని వి.ఆర్. ఎం.సి హై స్కూల్‌లో స్వచ్ఛతపై విస్తృత అవగాహన కార్యక్రమాలను శనివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సహకారంతో మరియు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ (AISLG) నాలెడ్జ్ పార్ట్నర్‌గా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అతిథులుగా మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వై.ఓ. నందన్ మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ దినేష్ లు పాల్గొన్నారు.

వారు విద్యార్థులకు మరియు సిబ్బందికి పర్యావరణ పరిరక్షణలో తమ పాత్ర గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల వర్గీకరణ (Segregation), ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ (Plastic Waste Management), చేతులు శుభ్రంగా ఉంచుకోవడం పై అవగాహన (Hand Wash Campaign) మరియు స్వచ్ఛ క్లీనప్ డ్రైవ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తడి-ఎండు వ్యర్థాలను వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి అంశాలపై అవగాహన పొందారు. అనంతరం నగరంలోని మార్కెట్ ప్రాంతంలో వ్యాపారులకు ప్లాస్టిక్ రహిత ప్రచార కార్యక్రమం (Plastic Free Campaign) నిర్వహించారు. వ్యాపారులకు సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మరియు ప్రజల్లో స్వచ్ఛతపై చైతన్యం పెంపొందించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం లభిస్తుందని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజలందరూ కలిసి స్వచ్ఛమైన నగర నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story