AS Peta: ఏఎస్ పేట సర్పంచ్ బరిలో సయ్యద్ సందని భాష నామినేషన్!

AS Peta: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆత్మకూరు వైఎస్సార్‌సీపీ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ సందని భాష గురువారం నామినేషన్ వేశారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 19 Nov 2026 8:10 PM IST
AS Peta
X

AS Peta: ఏఎస్ పేట సర్పంచ్ బరిలో సయ్యద్ సందని భాష నామినేషన్!

నెల్లూరు జిల్లా: ఏఎస్ పేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో సందడి మొదలైంది. ఏఎస్ పేట సర్పంచ్ అభ్యర్థిగా సయ్యద్ సందని భాష తన నామినేషన్ దాఖలు చేశారు. 2021 నుంచి 2026 వరకు ఏఎస్ పేట మండల కో-ఆప్షన్ సభ్యుడిగా పనిచేసిన సందని భాష, ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ మైనారిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

గతంలో ప్రజాసేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన సందని భాష, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగారు. కరోనా సమయంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసి ఎంతో మందికి అండగా నిలిచారు. అంతేకాదు పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు.

ప్రజాసేవే లక్ష్యంగా, ఏఎస్ పేట గ్రామ అభివృద్ధే ధ్యేయంగా సర్పంచ్ బరిలోకి దిగినట్లు సందని భాష తెలిపారు. గ్రామంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్య, వైద్య సౌకర్యాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.నామినేషన్ సందర్భంగా ఆయన అభిమానులు, గ్రామ పెద్దలు, వైఎస్సార్‌సీపీ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)