Atmakuru: నువ్వూరుపాడులో ఘనంగా “టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం” కార్యక్రమం!
Atmakuru: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు అంబేద్కర్ కాలనీలో టీడీపీ చేపట్టిన “2 ఏళ్ల నమ్మకం” కార్యక్రమం ఘనంగా జరిగింది.
Atmakuru: నువ్వూరుపాడులో ఘనంగా “టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం” కార్యక్రమం!
ఆత్మకూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వుూరుపాడు గ్రామంలో టీడీపీ అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి, మండల ప్రధాన కార్యదర్శి డా. తూమాటి శశిధర్ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కేతా విజయభాస్కర్ రెడ్డి, సూచనలతో నువ్వూరుపాడు అంబేద్కర్ కాలనీలో “టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ ప్రచార కరపత్రాలను ప్రజలకు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రజలు ప్రభుత్వ పనితీరుపై సానుకూల స్పందన వ్యక్తం చేయడంతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తమ విశ్వాసాన్ని వెల్లడించారు. ప్రజల ఆశీస్సులు, ఆదరణే టీడీపీ కూటమి ప్రభుత్వానికి మరింత బలాన్ని ఇస్తాయని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల టీడీపీ యూనిట్ ఇంచార్జి కొండ్రెడ్డి రమణారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సందేశాన్ని ప్రజలకు చేరవేశారు.




