Nellore: కార్పొరేషన్ విప్‌గా నూకరాజు మదన్ కుమార్ రెడ్డి నియామకం!

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ విప్‌గా న్యాయవాది, కార్పొరేటర్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డిని నియమించాలని టీడీపీ పెద్దలు నిర్ణయించారు.

Sowmya
Published on: 23 Nov 2026 11:32 AM IST
Nellore
X

Nellore: కార్పొరేషన్ విప్‌గా నూకరాజు మదన్ కుమార్ రెడ్డి నియామకం!

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థలో విప్‌గా నూకరాజు మదన్ కుమార్ రెడ్డిని నియమించాలని టీడీపీ పెద్దలు నిర్ణయించారు. కార్పొరేషన్‌లో కీలకమైన విప్ పదవికి ఆయనను ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మదన్ కుమార్ రెడ్డి మొదటి నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల అనుచరుడిగా కొనసాగుతున్నారు. వృత్తిరీత్యా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన, రాజకీయాల్లోనూ చురుకుగా వ్యవహరిస్తున్నారు.

కోటంరెడ్డి సోదరుల పట్ల ఉన్న అభిమానం, వారితో కొనసాగిస్తున్న సాన్నిహిత్యం, పార్టీ పట్ల నిబద్ధత నేపథ్యంలో కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మదన్ కుమార్ రెడ్డికి ఇప్పుడు కార్పొరేషన్‌లో కీలకమైన విప్ బాధ్యతలు దక్కనున్నాయి.

Sowmya

Sowmya