Nellore: నెల్లూరు మహానాడుకు పసుపు కళ.. నేతల పిలుపు!
Nellore: నెల్లూరు జిల్లాలో జరగనున్న టీడీపీ మహానాడును కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు నేతలు పిలుపునిచ్చారు.
Nellore: నెల్లూరు మహానాడుకు పసుపు కళ.. నేతల పిలుపు!
నెల్లూరు: మహానాడుకు వచ్చే మార్గాలను, ప్రధాన కూడళ్లను పసుపుమయం కావాలి, తడ నుంచి టంగుటూరు వరకు స్వాగత ఏర్పాట్లతో జాతీయ రహదారి పండగ వాతావరణం తలపించాలంటూ నేతలు పిలుపునిచ్చారు. పసుపు జెండాలు, బ్యానర్ లు, తోరణాలు, ప్రవేశ ద్వారాలతో అతిథులకు ఘనస్వాగతం పలుకాలని, సమిష్టి కృషితో నెల్లూరు మహానాడు ను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేద్దాం అంటూ నేతలు నిర్ణయించారు. అలంకరణ కమిటీ సభ్యులకు , శాసనమండలి సభ్యులు, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్ర సూచనలు చేశారు.
ఏపీలో అధికారం తెలుగుదేశం పార్టీ ఏడాదికోసారి నిర్వహించే పసుపు పండుగను ఈసారి నెల్లూరు జిల్లాలో మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ బోతోంది. రుచులు సుచులతో పాటు బడా నేతలకు పేరుగాంచిన నెల్లూరు మహానాడు తో పసుపు మయం చేసే విధంగా పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 27 28 29 లో నిర్వహించనున్న మహానాడు మార్గాలను పూర్తిగా పసుపు జెండాలతో నింపేయాలని నిర్వహణ కమిటీ నిర్వహించింది. పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సారధ్యంలో ఆహ్వాన కమిటీ ప్రచార కమిటీలు ఇవాళ సమావేశమయ్యాయి.
కోవూరు నియోజకవర్గ పరిధిలోని కొడవలూరు మండలం రేగడచి ప్రాంగణంలో నిర్వహించిన మహానాడు వేదికలు నవ్వుతో నా భవిష్యత్తు అన్న రీతిలో నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ లు ఇప్పటికే జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు దాంతో పసుపు పండుగను రాష్ట్రంలో మడెక్కడా లేనివిధంగా నిర్వహించాలని ప్రతిష్టాత్మకంగా కార్యాచరణకు నేతలు సిద్ధమయ్యారు.




