Nellore: నెల్లూరు 25వ డివిజన్ కార్పొరేటర్‌గా టీడీపీ అభ్యర్థి చక్రవర్ధన్ రెడ్డి ఘనవిజయం!
Nellore: నెల్లూరు కార్పొరేషన్ 25వ డివిజన్‌లో టీడీపీ ఘనవిజయం. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భాను ప్రకాశ్ రెడ్డిపై 1061 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన దాట్ల చక్రవర్ధన్ రెడ్డి.
Nellore: నెల్లూరు 25వ డివిజన్ కార్పొరేటర్‌గా టీడీపీ అభ్యర్థి చక్రవర్ధన్ రెడ్డి ఘనవిజయం!
Nellore: నెల్లూరు కార్పొరేషన్ 25వ డివిజన్ టీడీపీ అభ్యర్థి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి భారీ విజయం సాధించారు. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి భాను ప్రకాశ్ రెడ్డిపై 1061 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చక్రవర్ధన్ రెడ్డికి 2,481 ఓట్లు పోలయ్యాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా చక్రవర్ధన్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే.
మొదటిసారి పోటీ చేసి కార్పొరేటర్ గా గెలవడం విశేషం.. అనంతరం ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మర్యాదపూర్వకంగా కలిశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గథను బహుకరించారు.




