Atmakur: బీసీల పక్షపాతి చంద్రబాబు.. 34 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మకం: దాసరి!

Atmakur: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఆత్మకూరు టీడీపీ నేత దాసరి మధుసూదనరావు కొనియాడారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 19 Aug 2026 9:03 PM IST
Atmakur
X

Atmakur: బీసీల పక్షపాతి చంద్రబాబు.. 34 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మకం: దాసరి!

ఆత్మకూరు: ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోందని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ 4వ వార్డు టీడీపీ బీసీ నాయకుడు, ప్రముఖ కళాశాల అధ్యాపకుడు, గౌడ ఉద్యోగ సంఘం నాయకుడు దాసరి మధుసూదనరావు పేర్కొన్నారు.

1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ, చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం కృషి చేశారని తెలిపారు.1995లో చంద్రబాబు నాయుడు బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించారని, అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వాటిని 20 శాతానికి తగ్గించిందని పేర్కొన్నారు.

2024 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని దాసరి మధుసూదనరావు అన్నారు. బీసీలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించే ఈ నిర్ణయం దేశ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు.

బీసీ వర్గాల సంక్షేమం, రాజకీయ సాధికారతకు టీడీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా బీసీ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story