Nellore: కాకుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాకుపల్లి గ్రామంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.
Nellore: కాకుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి!
Nellore: నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో పేదల సేవలో ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.2 సంవత్సరాల కాలంలో ఇంత మంచి చేసిన కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలంటూ పిలుపునిచ్చారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు..కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండూ రెండు కళ్ళులా సాగుతున్నాయి.
పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర వర్గాలకు అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు .. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమ ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్తూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోంది.
అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి, ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ సారంగం గున్నయ్య, కో క్లస్టర్ ఇంచార్జ్ కుంచనపల్లి శివకుమార్, టీడీపీ నాయకులు కేశవులు, ఈశ్వరయ్య, మహేంద్ర రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రమణయ్య, మోహన్ రావు, వేణు, దయాకర్ రెడ్డి, సూర్యం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.




