Marripadu: స్కూల్ పిల్లల బస్సు కష్టాలకు తాత్కాలిక చెక్.. విజయ్ ఉదారత
Marripadu: నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు విద్యార్థుల బస్సు కష్టాలపై టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి ముత్యాల విజయ్ తక్షణమే స్పందించారు.
Marripadu: స్కూల్ పిల్లల బస్సు కష్టాలకు తాత్కాలిక చెక్.. విజయ్ ఉదారత
Marripadu: నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన 200 మందికి పైగా విద్యార్థులు ప్రతిరోజూ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైస్కూల్‌కు వెళ్లి విద్యను అభ్యసిస్తున్నారు. అయితే గ్రామం నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోవడంతో పెద్ద తరగతుల విద్యార్థులు మాత్రమే కొంతమంది బస్సులో వెళ్లగలుగుతున్నారు.
సైకిళ్లు ఉన్న విద్యార్థులు స్వయంగా పాఠశాలకు చేరుకుంటుండగా, చిన్న తరగతుల విద్యార్థులు మాత్రం బస్సులో ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొందరు విద్యార్థులు స్కూలుకు వెళ్లడం కూడా మానేస్తున్న పరిస్థితి నెలకొంది.ఈ సమస్యను గ్రామ కూటమి నాయకులు నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి ముత్యాల విజయ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి తన సొంత నిధులతో ఒక మ్యాజిక్ వాహనాన్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఆ వాహనం ద్వారా ప్రతిరోజూ 25 నుంచి 30 మంది విద్యార్థులను పాఠశాలకు తరలిస్తూ వారి చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా సహాయం చేస్తున్నారు. అలాగే గ్రామ ప్రజలు, తల్లిదండ్రుల విజ్ఞప్తిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి,
బస్సు సమయాల్లో మార్పులు చేసి ఒక ట్రిప్‌ను ముందుగా పాఠశాల విద్యార్థుల కోసం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు నిర్ణయించారు. బస్సు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు విద్యార్థుల చదువులు దెబ్బతినకుండా చేస్తున్న ముత్యాల విజయ్ సేవలను తల్లిదండ్రులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.




