Kovur: ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం: టీడీపీ నేతల ధ్వజం!
Kovur: మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలను కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.
Kovur: ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం: టీడీపీ నేతల ధ్వజం!
కోవూరు: కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో టిడిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకుడు కారకటి మల్లికార్జున మాట్లాడుతూ నిన్న మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ , దళిత మహిళపై దాడి జరిగిందని, పిల్లలు ఏడుస్తున్నారని అంటూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షిణించాయని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, వెంకన్నపురం స్కూల్ కమిటీ ఎన్నిక సమయంలో జరిగిన దాడి విషయంలో పోలీసులు విచారణ చేసి తగిన గుణపాఠం చెపుతారని అన్నారు.
ఐతే ప్రసన్నకుమార్ రెడ్డి పోలీసులపై ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని , మీ ప్రభుత్వంలో టిడిపి నాయకులపై, దళితులపై ఎన్ని కేసులు పెట్టారో , టిడిపి ప్రభుత్వంలో ఎవరిపై ఎన్నికేసులు పెట్టారో తెలుసుకోవాలని అన్నారు.
పోలీసులు మీమాట వింటే మంచివారు ,మాట వినకుంటే పోలీసులపై బెదిరింపులు చేయడం ప్రసన్నకు అలవాటేనని అన్నారు . సిబిఐ , విజిలెన్స్ విచారణ ఇప్పుడు పోలీసులపై కాకుండా వైసిపి ప్రభుత్వంలో ఎన్ని గ్రావెల్ తవ్వకాలు జరిపారో , ఎన్ని ప్రభుత్వ భూములను పట్టాలుగా మార్చుకుని దోచుకున్నారో , మీ ప్రభుత్వంలో కొడవలూరులో పనిచేసిన ఎస్సైపై , విచారణ చూపిస్తే అన్ని బైటకు వస్తాయని అన్నారు.
మా ఎంయల్ఏ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వచ్చిన తరువాత కోవూరు నియోజకవర్గంలో ప్రజలు మనస్సెంతిగా ఉన్నారని అన్నారు . మా ఎంయల్ఏ పై , మా పార్టీ పై అనుచితంగా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు . ఈ సమావేశంలో నీటిసంఘాల నాయకుడు మండిపాటి రమణారెడ్డి ,పాటూరు రమేష్ ,తువ్వర ప్రవీణ్ , సిద్దార్థ , బాబీ , బండి కిరణ్ కుమార్ ,విల్సన్ , వెంకన్నపురం గ్రామానికి చెందిన డి లావణ్య , తదితరులు పాల్గొన్నారు.




