Udayagiri: మాజీ మంత్రి అనిల్ కుమార్‌పై ఉదయగిరి కూటమి నేతల ధ్వజం!

Udayagiri: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై ఉదయగిరి కూటమి నేతల తీవ్ర ఆగ్రహం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 4 Sept 2026 5:27 PM IST
Udayagiri
X

Udayagiri: మాజీ మంత్రి అనిల్ కుమార్‌పై ఉదయగిరి కూటమి నేతల ధ్వజం!

Udayagiri: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు టీడీపీ కూటమి మండల కన్వీనర్లు, సీనియర్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై ఘాటు విమర్శలు చేశారు.నీటిపారుదల శాఖ మంత్రిగా కంటే ‘నోటి దూల మంత్రి’గానే అనిల్ కుమార్ ప్రజలకు గుర్తుండిపోయారని ఎద్దేవా చేశారు.

నిత్యం ప్రజల మధ్య ఉంటూ సేవలందిస్తున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని విమర్శించే నైతిక అర్హత అనిల్ కుమార్‌కు లేదన్నారు.విపీఆర్ ఫౌండేషన్ ద్వారా రాజకీయాల్లోకి రాకముందే ప్రజలకు సేవలందించడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు.

నెల్లూరు జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలను విపక్షాలు అడ్డుకోవడం వల్ల నిరుద్యోగ యువత నష్టపోయారని ఆరోపించారు.గత లోక్‌సభ ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి 2,45,902 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారని, ఆయన ప్రజాదరణను తక్కువ చేసి మాట్లాడటం ప్రజల తీర్పును అవమానించడమేనని స్పష్టం చేశారు.వ్యక్తిగత విమర్శలు మాని జిల్లా అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనపై ప్రతిపక్షాలు మాట్లాడాలని హితవు పలికారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI

Next Story