Rapur: గోనుపల్లి అభివృద్ధిపై ఎమ్మెల్యే కురుగొండ్లకు వినతి
Rapur: నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి టీడీపీ నేతలు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను కలిసి గ్రామ సమస్యలు, అభివృద్ధి పనులపై వినతిపత్రం ఇచ్చారు.
Rapur: గోనుపల్లి అభివృద్ధిపై ఎమ్మెల్యే కురుగొండ్లకు వినతి
రాపూరు: నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని గోనుపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం వెంకటగిరి స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువాలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం గోనుపల్లి గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు ఉపయోగపడే పలు అంశాలను వివరించి, గ్రామ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు...గ్రామంలోని సమస్యలను ఎమ్మెల్యేకు వివరించి, గోనుపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.




