Udayagiri: స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 34% రిజర్వేషన్లపై టీడీపీ నేతల హర్షం
Udayagiri: స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ లభించడం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ఉదయగిరిలో టీడీపీ నాయకుడు చెంచాల బాబు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.
Udayagiri: స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 34% రిజర్వేషన్లపై టీడీపీ నేతల హర్షం
ఉదయగిరి: స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ లభించడంతోపాటు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఉదయగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు చెంచాల బాబు యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు సముచిత స్థానం కల్పించడంలో ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించనుందని తెలిపారు.బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెంచాల బాబు యాదవ్ పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం కావడం పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు రియాజ్ బొజ్జ నరసింహ నల్లిపోగు రాజా తదితరులు పాల్గొన్నారు




