Nellore: నెల్లూరు మహానాడుకు ముహూర్తం ఖరారు ఇఫ్కో సెజ్ లో నేతల భారీ స్కెచ్

Nellore: నెల్లూరులో మే 27 నుండి 29 వరకు నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై ఇఫ్కో సెజ్ లో సన్నాహక సమావేశం.

V. Narasimhulu, Nellore
Published on: 13 May 2026 1:45 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు మహానాడుకు ముహూర్తం ఖరారు ఇఫ్కో సెజ్ లో నేతల భారీ స్కెచ్

నెల్లూరు: మే 27,28,29 తేదీలలో నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న మహానాడును విజయవంతం చేసేందుకు కొడవలూరు మండలం, ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు "మహానాడు సన్నాహక కమిటీ సమావేశం " ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల తో నివాళులు అర్పించారు.

శాసనమండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర అధ్యక్షతన జరుగుతున్న "మహానాడు నిర్వహణ కమిటీ సమావేశం "లో రాష్ట్ర మంత్రులు, ఎంపీ లు , శాసనసభ్యులు,శాసన మండలి సభ్యులు, ఛైర్మన్ లు, ప్రతినిధులు పాల్గొన్నారు. మహానాడు కు తరలిరానున్న అతిథులకు అవసరమైన భోజనం, వసతి, రవాణా, వాలంటీర్, పారిశుధ్య, సాంస్కృతిక సేవలను అందించేందుకు అవసరమైన ఏర్పాట్లపై కమిటీ సభ్యులతో చర్చించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story