Sangam: ప్రభుత్వ బడి విద్యార్థులకు ఐడీ కార్డుల పంపిణీ!
Sangam: నెల్లూరు జిల్లా సంగంలో తిరుమనతిప్ప ఎస్టీ కాలనీ పాఠశాల విద్యార్థులకు కాకు వెంకట కొండయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐడీ కార్డులు పంపిణీ చేసిన ఎంఈఓ మల్లయ్య.
Sangam: ప్రభుత్వ బడి విద్యార్థులకు ఐడీ కార్డుల పంపిణీ!
Sangam: నెల్లూరు జిల్లా సంగంలోని తిరుమనతిప్ప ఎస్టీ కాలనీ మోడల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టీడీపీ యువ నాయకులు కాకు మధుసూదన్ యాదవ్ దాతృత్వంతో ఐడీ కార్డులు అందించారు. పాఠశాల ఉపాధ్యాయులు కోరిన వెంటనే స్పందించిన ఆయన, పాఠశాలలోని విద్యార్థులందరికీ కాకు వెంకట కొండయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐడీ కార్డులను సమకూర్చారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య పాల్గొని విద్యార్థులకు ఐడీ కార్డులను అందజేశారు. విద్యార్థుల అవసరాన్ని గుర్తించి ప్రభుత్వ పాఠశాలకు సహకారం అందించిన కాకు మధుసూదన్ యాదవ్‌ను ఎంఈఓ, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని, విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలిచిన ఆయన సేవలను ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.




