Kaluvoya: చింతలాత్మకూరులో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి లిఖిత ప్రచారం

Kaluvoya: కలువాయి మండలం చింతలాత్మకూరులో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఆరవ లిఖిత, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Madhav Goud, Nellore
Published on: 31 Oct 2026 9:29 PM IST
Kaluvoya
X

Kaluvoya: చింతలాత్మకూరులో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి లిఖిత ప్రచారం

నెల్లూరు జిల్లా: కలువాయి మండలం చింతలాత్మకూరు గ్రామంలో టీడీపీ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి ఆరవ లిఖిత, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్టించారు. ఈ సందర్బంగా ధనుంజయరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థలలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపిస్తే స్థానిక సమస్యలు పరిష్కరించే వీలుకలుగుతుందన్నారు.

ఈ ప్రాంతం సోమశిల జలాశయం చెంతనే వున్న కొన్ని గ్రామాలకు సాగు నీరు అందె పరిస్థితి లేదన్నారు. విటన్నిటిని సాధించుకునేదుకు స్థానిక సంస్థలలో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించి స్థానిక శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ కు కానుకగా అందించి మన సమస్యలను సాధించుకుందామన్నారు.

మండలంలో 12 సెగ్మెంట్ లలో ఎంపీటీసీ అభ్యర్థులను, జడ్పీటీసీ అభ్యర్థి ఆరవ లిఖితను అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండలపార్టీ అధ్యక్షులు చల్లా రఘురామ్ రెడ్డి,తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు నాయుడు,డాక్టర్ రాజేష్, శివారెడ్డి, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore