Atmakur: ఉపాధ్యాయుల ఎఫ్‌ఎల్ఎన్ (FLN) శిక్షణను పరిశీలించిన ఏపీసీ!

Atmakur: ఆత్మకూరులో ఉపాధ్యాయులకు 'ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ' (FLN) శిక్షణ.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 6 Jun 2026 7:31 PM IST
Atmakur
X

Atmakur: ఉపాధ్యాయుల ఎఫ్‌ఎల్ఎన్ (FLN) శిక్షణను పరిశీలించిన ఏపీసీ!

ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఉపాధ్యాయులకు ఫౌండేషన్ లీటరసీ అండ్ న్యూమరసి శిక్షణాకార్యక్రమాన్ని జిల్లా సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటసుబ్బయ్య సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1,2తరగతుల విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం కొత్తగా అనేక సంస్కరణలతో నూతన టెక్స్ట్ బుక్స్ వచ్చాయి.

అదే విధంగా ఈ విద్యాసంవత్సరం రెడీనెస్ పాఠ్యపుస్తకాలు ప్రతి విద్యార్థికి సరఫరా చేస్తామని ఆగస్టు వరకు రెడీనెస్ కృత్యాలు చేయించాలని, విద్యార్థులకు సామర్ధ్యదారిత, ఆటపాటలతో, కృత్యధార భోదన మరియు దీక్ష ప్లాట్ ఫామ్ వంటివి డిజిటల్ భోధనలో ఉపయోగించాలని చేయాలని సూచించారు.

అదే విధంగా ఈ విద్యాసంవత్సరం పాఠశాలల నమోదుకూడా పెరిగింది. ఇంకా ఉపాధ్యాయులు పెంచడానికి కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణాకార్యక్రమం కోర్స్ డైరెక్టర్ శ్రీమతి అనంతలక్ష్మి గారు, ఆత్మకూరు మండల MEO 2 చలపతి గారు, మర్రిపాడు MEO-1 తిరుపతయ్య గారు, మర్రిపాడు MEO-2 ధనలక్ష్మి గారు మండలాల DRP లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story