Nellore: అక్రమ గోవధ కలకలం.. సమాచారమిచ్చారని యువకులపై దాడి!

Nellore: నెల్లూరు నగర సమీపంలోని చింతారెడ్డిపాలెంలో అక్రమ గోవధ కలకలం రేపింది.

V. Narasimhulu, Nellore
Published on: 1 Jun 2026 8:36 AM IST
Nellore
X

Nellore: అక్రమ గోవధ కలకలం.. సమాచారమిచ్చారని యువకులపై దాడి!

Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఓ వైపు , మరోవైపు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గోవధపై కఠినమైన నిబంధనలు ఆంక్షలు విధిస్తూ.. ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. నెల్లూరు నగరంలో యథేచ్ఛగా గోవధ జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. నిబంధనలకు వ్యతిరేకంగా గోవధ చేపడితే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కఠినమైన శిక్షలు అమలు చేస్తామని అధికారులు చెబుతున్న మాటల్ని పెడచెవిన పెడుతున్నారు కొందరు అక్రమార్కుల ముఠా. ఈ నేపథ్యంలో.. నెల్లూరు నగర సమీపంలోని చింతా రెడ్డిపాలెం ఖాళీ లే అవుట్ లలో గోవధ జరుగుతున్నట్లు సమాచారం వచ్చింది.

గడచిన నాలుగు రోజుల్లో పెద్ద ఎత్తున గోవులను హతమార్చి, మాంసం విక్రయించినట్లు ఆనవాళ్లు లభించాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గోవధ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇది ఇలా ఉంటే పోలీసులకు సమాచారం ఇచ్చారనే కోపంతో కొందరు, సమాచారం అందించారని అనుమానంతో యువకులపై దాడులకు పాల్పడ్డారు. పలువురు యువకులకు తీవ్ర గాయాలు కావడంతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోవధకు కారణమైన నిందితుల్ని పట్టుకొని శిక్షించాలని కోరుతున్నారు స్థానికులు. గోవధపై స్థానిక చింతారెడ్డిపాలెం వాసుల ఆగ్రహం వ్యక్తంచేశారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story