Nellore: కావలి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కలెక్టర్
Nellore: కావలిలో కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పర్యటన. రైల్వే అండర్‌పాస్ పరిశీలన, రూ. కోటితో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.
Nellore: కావలి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కలెక్టర్
నెల్లూరు జిల్లా: కావలి పట్టణంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా పర్యటన కొనసాగింది.. ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి రైల్వే అండర్ పాస్ ను పరిశీలించారు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు. ఉదయగిరి రోడ్డు నుంచి "ఐడి ఎస్ ఎంటీ " లే అవుట్ వరకు కోటి రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కలెక్టర్ హిమాన్షు శుక్లా, గళరావు నగర్ ప్రజల చిరకాల కోరికను నెరవేరుస్తూ చేపట్టిన చుక్కల భూములకు విముక్తి కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ల నేతృత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకు వెళతామని చెప్పారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. కావలి పట్టణాన్ని కనక పట్టణంగా రూపుడమే తన లక్ష్యమని, ప్రతిపక్షాల విమర్శలకు భయపడేదే లేదని చెప్పారు. జిల్లా వ్యవస్థపై మంచి పట్టు ఉన్న కలెక్టర్ మన జిల్లాకు రావడం అదృష్టమని చెప్పారు. కలెక్టర్ చేపట్టిన ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి తమ అండదండలు ఉంటాయని, మరోసారి స్పష్టం చేశారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.




