Kaluvoya: పర్లకొండలో రెండు ఆలయాల్లో చోరీ హుండీలు ఎత్తుకెళ్లిన దొంగలు!
Kaluvoya: నెల్లూరు జిల్లా కలువాయి మండలం పర్లకొండలో మాతమ్మ, పోలేరమ్మ ఆలయాల్లో హుండీల చోరీ. వరుస దొంగతనాలతో తీవ్ర ఆందోళనలో గ్రామస్థులు.
Kaluvoya: పర్లకొండలో రెండు ఆలయాల్లో చోరీ హుండీలు ఎత్తుకెళ్లిన దొంగలు!
Kaluvoya: నెల్లూరు జిల్లా కలువాయి మండలం పర్లకొండ గ్రామంలో రెండు ఆలయాల్లో చోరీ ఘటన కలకలం రేపింది, గ్రామంలోని మాతమ్మ, పోలేరమ్మ ఆలయాలను టార్గెట్ చేసిన గుర్తుతెలియని దొంగలు హుండీలను ఎత్తుకెళ్లారు.
ఉదయం ఆలయాలకు వెళ్లిన భక్తులు హుండీలు కనిపించకపోవడంతో విషయాన్ని గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు,ఒకే గ్రామంలో రెండు ఆలయాల్లో చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో వరుసగా ఆలయాలే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు,రాత్రి వేళల్లో ఆలయాల వద్ద భద్రత లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆలయాల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి దొంగలను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు, ఆలయ చోరీలకు అడ్డుకట్ట వేసి భక్తుల ఆస్తులకు రక్షణ కల్పించాలని మండల ప్రజలు పోలీసులను కోరుతున్నారు.




