Thotapalligudur: ముంగలదొరువులో ఘనంగా పౌష్టికాహార మాసోత్సవాలు

Thotapalligudur: ముంగలదొరువు అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించిన సిబ్బంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Sept 2026 8:54 PM IST
Thotapalligudur
X

Thotapalligudur: ముంగలదొరువులో ఘనంగా పౌష్టికాహార మాసోత్సవాలు

తోటపల్లిగూడూరు: తోటపల్లిగూడూరు మండలం ముంగల దొరువు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పౌష్టికాహార మాసోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యతను వివరించారు. ప్రతిరోజూ సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.

చిన్నారుల ఎదుగుదలకు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి పోషక విలువలున్న ఆహారం ఎంతో అవసరమని సిబ్బంది వివరించారు.

ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, పాలు వంటి పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ లలితాంబ, అంగన్వాడీ టీచర్ జ్యోతి, ఎంపీపీ స్కూల్ టీచర్ కళావతి, హెల్పర్లు కామాక్షమ్మ, సునీత, మధుసూదనమ్మ,పి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్