Gudur: గూడూరు ఎస్కేఆర్ కళాశాలకు క్రీడా పరికరాల వితరణ!

Gudur: గూడూరు ఎస్కేఆర్ డిగ్రీ కళాశాలలో 1983-86 బ్యాచ్ పూర్వ విద్యార్థులు రూ.30 వేల విలువైన క్రీడా పరికరాలను ప్రిన్సిపల్ రాంప్రసాద్‌కు అందజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Oct 2026 6:35 PM IST
Gudur
X

Gudur: గూడూరు ఎస్కేఆర్ కళాశాలకు క్రీడా పరికరాల వితరణ!

Gudur: స్థానిక ఎస్. కె.ఆర్ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థులు క్రీడా పరికరాలను ఎస్. కె.ఆర్ కళాశాల ప్రిన్సిపల్ రాంప్రసాద్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1983 - 86 సంవత్సరంలో బిఎస్సి ( బి. జడ్.సి) పూర్తి చేసిన విద్యార్థులు 30 వేల రూపాయలు విలువైన క్రీడా పరికరాలను అందజేశారు. పూర్వ విద్యార్థుల చేయూత అభినందనీయమని కొనియాడారు. కళాశాల విద్యార్థులు క్రీడా పరికరాలను ఉపయోగించుకొని క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం సెక్రటరీ నాగేంద్రప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ అమ్మాజీ, పూర్వ విద్యార్థులు శరత్ బాబు, శ్రీధర్ రెడ్డి, మనోహర్ రావు , విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్