Nellore: స్వామిపై అచంచల భక్తి.. బ్రహ్మోత్సవాలకు టన్నుల కూరగాయలు వితరణ

Nellore: నెల్లూరు జిల్లా పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతికి చెందిన కూరగాయల వ్యాపారి పుసుపులేటి నాగరాజు 3.5 టన్నుల కూరగాయలను వితరణ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 April 2026 8:33 PM IST
Nellore
X

Nellore: స్వామిపై అచంచల భక్తి.. బ్రహ్మోత్సవాలకు టన్నుల కూరగాయలు వితరణ

Nellore: నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి, ఒక కూరగాయల వ్యాపారి స్వామి పై భక్తితో ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నాడు, పుసుపులేటి నాగరాజు అనే కూరగాయల వ్యాపారి తిరుపతిలో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు,

ఆయనకు లక్ష్మీనరసింహస్వామి మీద ఉన్న భక్తితో గత 7 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలకు మూడున్నర టన్ను కూరగాయలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు దైవ సేవ అంటే కేవలం పూజలు చేయడమే కాదు తోటి భక్తుల ఆకలి తీర్చటం కూడా అని ఒక సామాన్య కూరగాయల వ్యాపారి నిరూపిస్తున్నారు, కూరగాయల వ్యాపారి నాగరాజు మాట్లాడుతూ..

నాకు నా కుటుంబానికి లక్ష్మీనరసింహస్వామి మీద ఉన్న భక్తి తో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు స్వామి వారి ఉచిత అన్నదానానికి కూరగాయలను పంపిణీ చేయడం జరుగుతుందని ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అన్నదానానికి సరిపడా కూరగాయలను అందించడం జరిగిందన్నారు, స్వామి వారి మీద భక్తిని ఈ విధంగా చాటుకుంటున్నానని ఆ స్వామివారి కృపాకటాక్షాలు మన అందరి పైన ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story