Atmakuru: బీజేపీ సమావేశాన్ని విజయవంతం చేయండి: సంతోష్ కుమార్!
Atmakuru: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ బీజేపీ పదాధికారుల సమావేశం ఆగస్టు 1న నిర్వహించనున్నారు.
Atmakuru: బీజేపీ సమావేశాన్ని విజయవంతం చేయండి: సంతోష్ కుమార్!
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో పట్టణ పదాధికారుల సమావేశాన్ని ఆగస్టు 1న (శనివారం) ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు పట్టణ అధ్యక్షుడు నున్నా సంతోష్ కుమార్ తెలిపారు.
సమావేశానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ మాల్యాద్రి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.
పట్టణ పదాధికారులు,బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని నున్నా సంతోష్ కుమార్ కోరారు.
Next Story




