Nellore: కోటి రూపాయల నకిలీ నోట్ల దందాలో ఇద్దరు పోలీసుల అరెస్ట్!

Nellore: భారీ మోసం. 10 లక్షల అసలు నోట్లకు కోటి నకిలీ నోట్లు ఇస్తామని తమిళనాడు వ్యాపారులను పిలిపించి దోచుకున్న ట్రాఫిక్ ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్.

VIJAY, G.D.NELLORE
Published on: 17 May 2026 2:16 PM IST
Nellore
X

Nellore: కోటి రూపాయల నకిలీ నోట్ల దందాలో ఇద్దరు పోలీసుల అరెస్ట్!

నెల్లూరు: గంగధర నెల్లూరు నియోజకవర్గం, గంగాధర నెల్లూరు మండలం లో ఘరానా మోసం.. పోలీసులే దొంగలుగా మారిన వైనం ​10 లక్షల అసలు నోట్లకు.. రూ. కోటి నకిలీ నోట్లు ఇస్తామంటూ ఖాకీల ఎర. ​తమిళనాడు వ్యాపారులను నమ్మించి పిలిపించి, బెదిరించి రూ. 10 లక్షలు దోపిడీ. ​దోపిడీ ముఠాలో చిత్తూరు ట్రాఫిక్ ఏఎస్సై లోకనాథం, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రవి..

​ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ముఠాలోని సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు. ​బాట్టుకండిగ గ్రామం వద్ద నిందితులను అదుపులో కి తీసుకున్న జీడీ నెల్లూరు పోలీసులు. ​కొబ్బరికాయల వ్యాపారం పేరిట వచ్చి దోచుకున్నారంటూ మొదట బాధితుల డ్రామా. ​విచారణలో నకిలీ నోట్ల మార్పిడి దందా అసలు రంగు బయటపెట్టిన జిడినెల్లూరు పోలిసులు.

VIJAY, G.D.NELLORE

VIJAY, G.D.NELLORE

Next Story